Xiaomi ఇండియా హైదరాబాద్ మార్కెట్ లోకి Redmi K50i 5g స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. కె.పి.హెచ్.బి లోని సుజనా ఫోరం మాల్ లో జరుగుతున్న లైవ్ ఎక్స్ ట్రీమ్ లో భాగంగా Xiaomi జోనల్ మేనేజర్ శివేందర్ సింఘ్, తెలంగాణ హెడ్ అన్వ ర్ తో సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు, డైరెక్టర్ సుహాస్ నల్లచెరు కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా సెల్‌బే M.D నాగరాజు మాట్లాడుతూ ఎప్పటికప్పు మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా సెల్ ఫోన్ తయారీ దారి సంస్ధ వినూత్న ఫీచర్స్ తో విభిన్నమైన స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా నగర మార్కెట్ లో Xiaomi Redmi K50i 5g అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తమ సెల్‌బే షోరూమ్ల ద్వార తమ కస్టమర్ లకు ఎల్లప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు అందజేస్తున్నామని వివరించారు.

ఈ సందర్బంగా Xiaomi తెలంగాణ హెడ్ అన్వర్ మాట్లాడుతూ Redmi K50i ఫోన్ 5g నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుందని, ఇది mediatek 8100 ప్రాసెసర్ కలిగి, 6.6″ అంగుళాల స్క్రీన్ పరిమాణం, 64mp ట్రిపుల్ కెమెరా కలిగి ఉంటుందన్నారు. సెల్ బే డైరెక్టర్ సుహాస్ నల్లచెరు Xiaomi మార్కెటింగ్ మేనేజర్ శివ కృష్ణా తదితరులు పాల్గొన్నారు