vishwak sen in pagal

గత ఏడాది ‘హిట్ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘పాగల్’ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. అంద‌రూ స‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నాం. చాలా రిస్కీ టైమ్‌.. నా సినిమా కంటే ముందు పెద్ద సినిమా ఏదీ రాలేదు, టిక్కెట్టు రేట్స్ విష‌యంలోనూ, ఇలా చాలా స‌మ‌స్య‌లున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నేను, బెక్కెం వేణుగోపాల్‌గారు న‌మ్మి ఈ సినిమాపై రెండు రూపాయ‌లు రిస్క్ చేద్దామంటే, మాకంటే  ఈ సినిమాను ఎక్కువ‌గా న‌మ్మిన దిల్‌రాజుగారు నాలుగు రూపాయ‌ల రిస్క్ చేశారు. అంద‌రం ప్రేమించి సినిమా చేశాం. ‘పాగల్’ ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు.. ప్రేమ గురించి చెప్పే క‌థ‌. ఇందులో స్ట్రాంగ్‌ గా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇందులో భూమిక‌గారు నా అమ్మ పాత్ర‌ను చేశారు. చాలా మంది నన్ను ల‌వ్‌స్టోరీ చేయ‌మ‌ని అంటుంటే.. ఏకంగా ఐదు ల‌వ్‌స్టోరీస్ ఉండే సినిమాను చేశాను. అదే పాగ‌ల్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌లో క‌నిపించ‌ని ఓ హీరోయిన్ సినిమాలో మాత్రమే క‌నిపించ‌బోతుంది. ఆమె ఎవ‌రో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అని పాగల్ చిత్ర హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజ్ ఈ కార్యక్రమంలో అన్నారు.

vishwak sen with pagal movie team

పాగల్ చిత్రానికి వస్తే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రంతో న‌రేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా నివేత పేతురాజ్ తో పాటు మరో నలుగురు అమ్మాయిలు నటిస్తుండగా హీరో కి తల్లిగా భూమిక నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. బాగా చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *