రెడ్ ప్రీ రిలీజ్ వేడుక కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చిత్ర బృందం త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘స్టే సేఫ్ – సేవ్ సినిమా’ అని రాసి ఉన్న ఒక పెద్ద టికెట్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ‘రెడ్’ సినిమా పై ట్రోల్స్ చేయిస్తోంది. ఆ టికెట్ పై ‘రెడ్’ స్టిక్కర్ వేసినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ‘జనవరి 14’కి బదులుగా ‘జనవరి 9’ అని రాసి ఉంది. అది ‘క్రాక్’ సినిమా రిలీజ్ డేట్. దీంతో ‘క్రాక్’ ఈవెంట్ లో రిలీజ్ చేసిన టికెట్ పై ఇప్పుడు ‘రెడ్’ పేరు మార్చినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ – ఈవెంట్ ఆర్గనైజర్స్ పై మీమ్స్ క్రియేట్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ పై రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి.. ఏం పర్వాలేదు” అని ఈవెంట్ ఆర్గనైజర్ అయిన శ్రేయాస్ మీడియా ని టాగ్ చేస్తు ట్వీట్ చేశాడు రామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *