Sampath Raj 6 scaled
Interviews

‘లౌక్యం’ సక్సెస్ కి ఐ ఫోన్లు ఇచ్చారు,’చెక్’కి అంతకంటే పెద్దగిఫ్ట్ అడగాలి! – సంపత్ రాజ్ ఇంటర్వ్యూ

సంపత్ రాజ్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ  నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తోప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో ‘లౌక్యం’లో అతడికి మంచిపాత్ర ఇచ్చి  భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం’చెక్’. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా  క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటిదర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’.  శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ తోఇంటర్వ్యూ… ‘చెక్‘ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి… మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేదిచాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో  ఒకే కాస్ట్యూమ్ లోకనిపిస్తారు.రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో… అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా చాలా బావుంటుంది.  ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ‘చెక్‘ భిన్నమైన సినిమా అనుకోవచ్చా? అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువలోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి.  షూటింగ్ చేసేటప్పుడునేను అనుకున్నది ఏంటంటే… నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలుజీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా.  పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటేఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండాదర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని  తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకునమ్మకం ఉంది.  ట్రైలర్ చూస్తే మీరు పోలీస్ గా చేశారని తెలుస్తుంది. నితిన్ లాస్ట్ సినిమా ‘భీష్మ ‘లోకూడా మీరు పోలీస్ గా చేశారు కదా! ‘భీష్మ’లో నేను పోలీస్ అయినప్పటికీ… అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు  సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు.  ‘చెక్‘లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలుకావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం  ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆపాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్  రోల్, డిఫరెంట్ పోలీస్ అని అర్థమైంది.