పుష్ప: ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా మంగళం శ్రీనుగా సునీల్ పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఇన్నేళ్లు ఆయనను కమెడియన్ గా మాత్రమే చూసాం. ఇప్పుడు సునీల్ లోని మరో కోణాన్ని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. అందుకే రాక్షసుడి పరిచయం చేస్తున్నాం అంటూ సునీల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జుట్టుకు రింగు.. ఫోన్ మాట్లాడుతూ ఉరిమి చూసే కళ్లు.. చూడగానే భయపడే రూపంతో సునీల్ పోస్టర్ అదిరిపోయింది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.


పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో సునీల్ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తుండగా ఈ చిత్రానికి ఫైట్స్ రామ్ లక్ష్మణ్ మరియు పీటర్ హెయిన్స్ అందిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *