`సమ్మోహనం`, `వి` తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి. వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, మైత్రి మూవీ మేక‌ర్స్ వై. ర‌విశంక‌ర్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు  గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కి అంద‌జేశారు.

ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో
బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేష్‌. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.

అవ‌స‌రాలు శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

సుధీర్ బాబు, కృతిశెట్టి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి,
నిర్మాత‌లు: బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి
స‌మ‌ర్ఫ‌ణ‌: గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు,
బేన‌ర్‌: బెంచ్‌మార్క్ స్టూడియోస్‌,
సంగీతం: వివేక్ సాగ‌ర్,
సినిమాటోగ్ర‌ఫి: పీజీ విందా,
ఆర్ట్‌: ర‌వీంద‌ర్‌,
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి,
కో- డైరెక్ట‌ర్‌: కోట సురేష్ కుమార్‌,
పిఆర్వో: వ‌ంశి- శేఖ‌ర్‌.