సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Mahesh Babus Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record
Mahesh Babus Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట. ఇప్పుడు టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.

ఇపటికే కళావతి పాటతో పాటు పెన్నీ, సర్కారు వారి టైటిల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట నుంచి మాస్ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.రీసెంట్ గా ఈ మాస్ పాట షూటింగ్ పూర్తి చేస్కుకుంది.

Superstar Mahesh Babus Sarkaru Vaari Paata
Superstar Mahesh Babus Sarkaru Vaari Paata