ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నా సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

Pushpa the rise Sami Sami song promo out

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ‘సామి సామి’ అంటూ సాగే మూడో సింగిల్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అక్టోబర్ 28, ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నా సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ చిత్రం పాన్ ఇండియా ఐదు భాషల్లో విడుదల కానుంది. మీరు ఒకసారి ఈ సాంగ్ ప్రోమోని చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *