సమంత అక్కినేని కుక్కల కోసం కొత్తగా తన సాకీ బ్రాండ్ లో బట్టల కలెక్షన్ ను ప్రత్యేకంగా ప్రారంభించారు. సమంత అక్కినేని కుక్క హష్ నవంబర్ లో పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా సాకి బ్రాండ్ లో ఇకనుంచి కుక్కలకు కూడా దుస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సాక్షి ప్రముఖ ఎన్జీవో CUPA ( compassion unlimited plus action) తో జతకడుతున్న మని తెలిపింది ఈ ఎన్జీవో అనాధ కుక్కలకి ఆశ్రయం ఇస్తూ కుక్కల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఈ దుస్తులు విక్రయించగా వచ్చిన నా లాభాలు CUPA కి అందిస్తామని తెలిపింది సమంత. ఈ కలెక్షన్ లో కుక్కల కోసం ప్రత్యేకంగా బ్రాస్ జ్యువెలరీ అలాగే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా యూనిక్ గ్రాఫిక్స్ తో టీ షర్ట్ లు saaki x hash పేరుతో విక్రయించనున్నారు అని తెలిపింది.