మెగాహీరో సాయి ధరం తేజ్ కొద్దిసేపటి క్రితం తన స్పోర్ట్స్ బైక్ పైనుంచి కింద పడ్డారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ స్పృహ కోల్పోయారు.

సాయి తేజ్ హెల్మెట్ ధరించడం తో ప్రాణానికి ప్రమాదం లేదు అని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సాయి తేజ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ విషయం తెలియగానే ఫాన్స్ ఆందోళనచెందారు.

ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.  బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు.  అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు..

తాజా సమాచారం మేరకు ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. మరింత మెరుగైన చికిత్స కోసం జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం సాయి నీ తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *