రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమా “లడకి”. లడకి చిత్రం భారత దేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్ చిత్రం. మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయినా పూజ భలేఖర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని చైనా లో “డ్రాగన్ గర్ల్” టైటిల్ తో విడుదల చేస్తారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను నవంబర్ 8న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి లడకి చిత్రం నివాళి.


గాల్వాన్ ప్రతిపాదన తర్వాత చైనా దేశంలో విడుదల అవుతున్న మొట్టమొదటి భారత దేశపు చిత్రం “లడకి”.