Aranya Rating

అరణ్య చిత్రం తో చాలా గ్యాప్ తర్వాత రానా దగ్గుబాటి మళ్లీ తెరపైన కనిపించారు. బాహుబలి, గాజి, నేనే రాజు నేనే మంత్రి తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రానాకి అరణ్య పర్ఫెక్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అరణ్య లాంటి సినిమా చేయడం సాహసం లాగే అనుకోవాలి. ఎలాంటి కమర్షియల్ హంగుల కి పోకుండా కథను నమ్మి, ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. 30 ఏళ్ల కుర్రాడు 60 ఏళ్ల వృద్ధుడు గా తెరపై నటించడం అంత ఈజీ కాదు.

కదా ఏంటి?
తాతల ఆస్తి పంచుకొని అన్నదమ్ముల అందరూ విదేశాలకు వెళ్లి హ్యాపీగా సెటిల్ అవ్వగా రానా భారతదేశం లోనే ఉంటూ తన ఆస్తిని కాపాడుకుంటూ ఉంటాడు. తన ఆస్తి అడవి. అడవిలో ఉంటూ అడవి జంతువుల తో మాట్లాడుతూ వాటితో స్నేహం చేసి వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు.
రాష్ట్రపతి నుంచి లక్ష మొక్కలు నాటినందుకు అరణ్య బిరుదు పొందుతాడు రానా. ఇక ఎంతో ప్రేమగా చూసుకునే అడవి లో ఒక కార్పొరేట్ సంస్థ ఒక టౌన్ షిప్ ప్లాన్ చేస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకునే తన అడవిలో టౌన్షిప్ వెంచర్ ఏంటి అని రానా ప్రశ్నించగా రానా ని అడ్డుకుంటారు. టౌన్షిప్ ఎక్కడైతే కడుతుంటారు అదే మార్గంలో ప్రతి రోజు నువ్వులు నీళ్లు తాగడానికి చెరువుకి వెళ్తుంటాయి. ఇక ఆ కార్పొరేట్ సంస్థల వ్యక్తులను ఎదుర్కొని రానా చివరికి తన ఆస్తి అయినటువంటి అడివి ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ చిత్ర కథ.

ఎవరు ఎలా చేశారు?
అరణ్య చిత్రంలో లో రానా పర్ఫామెన్స్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు. తన భుజాలపై ఈచిత్రం నడిపించాడు. తన వేషధారణ దగ్గరనుంచి అన్నిటి మీద అ చాలా అలా ఏ కా గ్రహ తో పని చేసినట్లు మనకి స్క్రీన్ పైన కనబడుతుంది. 30 ఏళ్లు నిండిన రానా 60 ఏళ్ళ వృద్ధుడి లా ఈ చిత్రం లో కనిపించడం రానా ఫ్యాన్స్ కి కొంచెం జీర్ణించుకోలేని విషయం అనుకున్న రానా పర్ఫామెన్స్ చూసి ఫాన్స్ ఇది కథ మాకు కావాలి అని అనుకుంటారు. ఇక ఈ సినిమా దర్శకుడు ప్రభు సాల్మన్ చాలా బాగా తెరకెక్కించారు చిత్రాన్ని. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి సింది ఈ సినిమా యొక్క విజువల్స్ గురించి. ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఈ చిత్రంలో కొన్ని క్లోజప్ షాట్లలో ఏనుగుని మనం మనం ఎప్పుడూ చూడని విధంగా ఇంత దూరంలో కూడా ఏనుగుని ఫీలయ్యే లాంటి అద్భుతమైన షార్ట్స్ చిత్రీకరించాడు. ఇక ఆస్కార్ అవార్డ్ విజేత రసూల్ పూకుట్టి అందించిన సౌండ్ ఎఫెక్ట్స్ మిమ్మల్ని నిజంగా అడవిలోకి తీసుకెళ్తాయి. శాంతను అందించిన సంగీతం బావుంది, ఎడిటింగ్ పర్వాలేదు.

విష్ణు విశాల్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ఫస్ట్ఆఫ్ చాలా ఎంగెజింగ్ గా ఉంటుంది. రాణా చేసే విన్యాసాలు ఏనుగుల విజువల్స్ అడవి అందాలను చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అడవిని మూగ జీవులను కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పకనే చెప్పారు అరణ్య సినిమాతో. ఏరా సెంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టోరీ ఇచ్చే రేటింగ్ 3/5