మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కాజల్ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. చరణ్ ఇందులో 20 నిమిషాల నిడివి ఉండే పాత్రలో నటిస్తున్నాడు. దేవాదాయ శాఖ అవినీతి కుంభకోణాల నేపథ్యంలో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరపైకి తెస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.

తాజాగా ఈ మూవీ నుంచి చరణ్ ప్రీలుక్ నీ దర్శకుడు కొరటాల శివ రివిల్ చేశారు. ఫస్ట్ లుక్ కన్న ముందే ఈ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. “మా `సిద్ధ` సర్వం సిద్ధం…“ అంటూ కొరటాల స్వయంగా రామ్ చరణ్ ప్రీ లుక్ రివీల్ చేస్తూ ట్వీట్ చేసారు. ఆలయంలోకి ప్రవేశిస్తున్న సిద్ధునిగా రాంచరణ్ లుక్ ని ఆవిష్కరించగా.. అతడి ఫేస్ రివీల్ కాకుండా వెనక వైపు నుంచి లుక్ ని రివీల్ చేశారు. దూరంగా ఆలయం బ్లర్ గా కనిపిస్తోంది. ఇక చరణ్ మెడలో రుద్రక్షలు.. చెవి రింగు హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఈ లుక్ ప్రస్తుతం చెర్రీ అభిమానుల్లో మరో ఆసక్తికర చర్చకు బీజం వేసింది.