మెగా పవర్ స్టార్ ఆర్ రామ్ చరణ్ తేజ్ దసరా పండుగకు ఫ్యాన్స్కి శుభవార్త చెప్పారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు రామ్ చరణ్.


గౌతమ్ రామ్ చరణ్ కి సరిపోయే ఫాస్ట్ రేసింగ్ సబ్జెక్ట్ చెప్పి మెప్పించుకున్నారు. ఈ చిత్రం uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ నిర్మిస్తున్నారు.

ram charan and goutham tinnanuri combo announced

ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ కోసం తప్పకుండా నేను ఎదురుచూస్తున్నాను అని రామ్ చరణ్ ట్వీట్ చేయగ రామ్ చరణ్ దర్శకుడు గౌతమ్ కి జెర్సీ సమయంలో పంపించిన ఒక విషెస్ ని ఈరోజు ప్రపంచానికి తన ట్విటర్ ఖాతా ద్వారా గౌతమ్ షేర్ చేసుకున్నారు.


ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ శంకర్ దిల్ రాజు కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గౌతమ్ సినిమా ప్రారంభమవుతుంది ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు చిత్ర బృందం.

రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి అని తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *