అభిరామ్ దగ్గుబాటి తేజ దర్శకత్వం లో లో తెలుగు చలనచిత్ర సీమకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి అహింస అనే టైటిల్ని ఖరారు చేశారు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నిర్మాతలలో ఒకరైన  డి సురేష్‌బాబుతో కలిసి ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ (పి.కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పలు హిట్ చిత్రాల దర్శకుడు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ప్రోత్సహించే దర్శకుడు తేజ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో దగ్గుబాటి అభిరాం తో పాటు చాలా మంది నటులు దర్శకులు తేజ తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. అహింసా చిత్రంలో అభిరాం తో పాటు విలన్‌గా పరిచయం కాబోతున్నరు రజత్‌ బేదీ.

సుప్రసిద్ధ  దర్శకుడు తేజ, రజత్‌ బేదీని తెలుగు సినీ తెరకు పరిచయం చేస్తున్నారు.  త్వరలో విడుదల కానున్న ఈ అహింస చిత్రం ద్వారా రజత్‌ మరో మారు వెండితెరపై తన అద్భుత నటనా చాతుర్యం చూపనున్నారు.

సుప్రసిద్ధ దర్శకుడు  తేజ మాట్లాడుతూ ‘‘ ఆరు అడుగులకు పైగా ఎత్తుండే రజత్‌ బేదీ, హృతిక్‌ రోషన్‌ చిత్రం కోయీ… మిల్‌గయా ద్వారా సినీ తెరకు పరిచయం అయ్యాడు. దాదాపు 50కు పైగా సినిమాలు అతను చేశాడు. అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, సన్నీడియోల్‌, గోవిందా, జాన్‌ అబ్రహం, బాబీ డియోల్‌, సునీల్‌ శెట్టి తో పాటుగా రజనీకాంత్‌ లాంటి వారితోనూ నటించాడు. రజత్‌ బేదీకి అద్భుతమైన బాడీ ఉండటంతో పాటుగా చక్కటి ఆలోచన ధోరణి, యాటిట్యూడ్‌, ఫేస్‌, వాయిస్‌ ఉంది. మరోమారు ఇక్కడ అతను మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకోగలడు’’ అని అన్నారు.

రజత్‌ బేదీ యొక్క గోల్డెన్‌ జూబ్లీ చిత్రంగా మాత్రమే కాదు, అతని కమ్‌బ్యాక్‌ చిత్రంగా తెలుగు చిత్రం అహింస నిలుస్తుంది. దీనిలో అతను ప్రధానమైన విలన్‌గా నటిస్తున్నారు.  అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారీ జంటగా నటించిన ఈ చిత్రం యువత నేపథ్యంలో తీర్చిదిద్దుకున్న అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ (పి.కిరణ్‌) మరియు శ్రీ డి.సురేష్‌బాబులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అద్భుతమైన ఫిట్‌నెస్‌ కలిగి ఉండటంతో పాటుగా  నటన పరంగా అద్భుతాలను సృష్టించిన రజత్‌ బేదీ మాట్లాడుతూ ‘‘ తెలుగు చిత్రాలలో నూతన నటుడు లేదా స్టార్‌ వెలుగులోకి వచ్చినప్పుడు విలన్‌కు కూడా చక్కటి ప్రాధాన్యత లభిస్తుంది. ఈ సారి రజత్‌ బేదీగా నాకు తగిన అవకాశం లభించింది. రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్‌ కు ఎదురుగా విలన్‌గా నటించే అవకాశం  లభించడం ఆనందంగా ఉంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ (పి.కిరణ్‌) మరియు శ్రీ డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి తేజగారు దర్శకత్వం వహించారు. నటనకు అమిత ప్రాధాన్యతనిచ్చే ఆయన నూతన నటులను సూపర్‌స్టార్స్‌గా తీర్చిదిద్దడంలో దిట్ట’’అని అన్నారు

సుప్రసిద్ధ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కౌస్‌ మీడియాకి చెందడం తో పాటుగా రజత్‌ బేదీ మరియు అందాల తార గీతికా తివారీ సహా ఎంతో మంది నటులను తీర్చిదిద్దిన  శ్రీదేవి శెట్టి మాట్లాడుతూ ‘‘అత్యంత వేగంగా గోల్డెన్‌ జూబ్లీ మైలురాయిని రజత్‌ బేదీ చేరుకుంటుండటం పట్ల ఆనందంగా ఉంది. అతనితో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గర్వంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాము. అత్యంత క్రమశిక్షణ కలిగిన నటుడు రజత్‌. పూర్తి ప్రొఫెషనల్‌గా అతను వ్యవహరించే తీరుకారణంగానే సుప్రసిద్ధ సూపర్‌స్టార్లు సైతం అతనితో మరల మరల కలిసి చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.  సినీ పరిశ్రమలో అసలైన పంజాబీలలో ఒకడిగా , ఇప్పటికీ రజత్‌ యువకునిలా కనిపించడమే కాదు పూర్తి ఫిట్‌తో ఉంటాడు. విలన్‌గా, రజత్‌ తన ట్రేడ్‌మార్క్‌  బెదిరింపు మరియు భయంకరమైన లుక్స్‌ తీసుకురానున్నాడు. అదే సమయంలో అమాయకమైన, పక్కింటి కుర్రాడి లుక్‌లోనూ అతను అదరగొట్టగలడు. రజత్‌ ఎప్పుడూ కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే ఉంటాడు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా వెండితెరకు తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  రజత్‌ ఖచ్చితంగా మరిన్ని పాత్రలను ఆకర్షించగలడని, అలాగే పలు బ్రాండ్‌ ప్రకటనలలో కూడా కనిపించగలడని, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రమోషనల్‌డీల్స్‌ కూడా అందుకోగలడని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

‘‘ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ  రాకేష్‌ రోషన్‌ నిర్మించిన కోయి.. మిల్‌గయాలో హృతిక్‌ రోషన్‌కు ఎదురుగా విలన్‌గా నటించిన రజత్‌ బేదీని  ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు.  అభిరామ్‌ నటునిగా ప్రవేశం గురించి నేను పెద్దగా వెల్లడించను కానీ, అభిరామ్‌ అభిమానులు మాత్రం నన్ను ఖచ్చితంగా  సినిమాలో నా పాత్ర పరంగా అసహ్యించుకుంటారని మాత్రం చెప్పగలను. అయినప్పటికీ వారు నన్ను అభిమానించడంతో పాటుగా అభిరామ్‌ తొలి చిత్ర విలన్‌గా నన్ను గౌరవిస్తూనే, ఎప్పటికీ గుర్తుంచుకుంటారని  కూడా చెప్పగలను. విలన్‌గా తెలుగు చిత్రాలలో  ఓ చరిత్రను నేను సృష్టించలననే అనుకుంటున్నాను. ఈ చిత్రంలోని నా పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుంది’’ అని రజత్‌ బేదీ అన్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకుంటుండటంతో నటునిగా మరలా వెండితెరకు తిరిగి రావాలని రజత్‌ బేదీ కోరుకుంటున్నారు. ‘‘భారతీయ చిత్రానికి మరీ ముఖ్యంగా వినోద పరిశ్రమకు దూరంగా ఉండటం పట్ల నేను ఏమంత ఆనందంగా లేను. ఎందుకంటే నేను ఇక్కడి వాడిని !  ఇప్పుడు సమయం కూడా బాగా కుదిరింది. ఓటీటీ, కేబుల్‌, శాటిలైట్‌ టెలివిజన్‌, డీటీహెచ్‌ మరియు ఆన్‌లైన్‌ డిజిటల్‌ ఫార్మాట్‌లు విస్తృతం కావడంతో నూతన ప్రతిభావంతులకు అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. వారు విభిన్నమైన కథలను అంతే విభిన్నంగా ఽధైర్యంగా చెబుతున్నారు. నటనతో పాటుగా నేను ప్రొడక్షన్‌లో కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే ముంబైలో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించనున్నాను’’ అని రజత్‌ బేదీ అన్నారు.

రజత్‌ బేదీ తన  శక్తివంతమైన గొంతు, డైలాగ్‌ డెలివరీతో అత్యంత ప్రాచుర్యం పొందారు. ఇంటర్నేషల్‌ ఖిలాడీ చిత్రంలో ‘అగర్‌ ఆప్నే అదమ్‌ ఖోర్‌ షేర్‌ నహీ దేఖా… ఖూన్‌ పీనే వాలా భేదియా నహీ దేఖా… తో ఇస్సే దేఖియే (ఒకవేళ నువ్వు క్రూరమైన సింహాన్ని చూడకపోతే… ఒకవేళ నువ్వు రక్తం తాగే తోడేలును చూసి ఉండకపోతే… అతన్ని చూడు)’ డైలాగ్‌  ఎవరు మరిచిపోగలరు!

రజత్‌ బేదీ నటించిన చిత్రాలలో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఇంటర్నేషనల్‌ ఖిలాడీ, జోడి నెంబర్‌ 1, ఇండియన్‌, జానీ దుష్మన్‌, ఛోర్‌ మచాయీ షోర్‌, చాల్‌బాజ్‌, ద హీరో – లవ్‌ స్టోరీ ఆఫ్‌ ఏ స్పై, రక్త్‌, అక్సర్‌, రాకీ–ద రెబల్‌, జాన్‌–ఈ–మన్‌, పార్టనర్‌, ద ట్రైన్‌, ఖామోష్‌–ఖౌఫ్‌ కీ రాత్‌ వంటివి ఉన్నాయి.

రజత్‌, క్రీడా ప్రియుడు. బాస్కెట్‌బాల్‌, కబడ్డీ మరియు హాకీ వంటి క్రీడలను ఆడటాన్ని అమితంగా ఇష్టపడుతుంటాడు. క్రీడలు, వినోద లీగ్‌ ఫార్మాట్‌లలో పాల్గొనడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటారాయన. భారతదేశంలో క్రికెటేతర క్రీడలను ఇప్పుడు ప్రోత్సహిస్తున్న తీరును అమితంగా ఇష్టపడుతుంటారాయన. వినోద ప్రపంచం దీనికి ముందుకు రావడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు

రజత్‌ బేదీ ఖచ్చితంగా తన  ప్రభావాన్ని తెలుగు చిత్రాలలో  చూపించగలరు.  హీరోలతో పాటుగా విలన్‌లు కూడా మంచి పేరు తెచ్చుకోవడం తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. వీరిలో సోనూ సూద్‌, తరుణ్‌ అరోరా, ముఖేష్‌ ఋషి, రవి కిషన్‌ , అశీష్‌ విద్యార్థి, అశుతోష్‌రానా, సయాజీ షిండే, ప్రకాష్‌ రాజ్‌, ప్రదీప్‌ రావత్‌ (ఘజని), షరద్‌ కేల్కర్‌, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ వంటి విలన్లను మనము ఇదివరకే తెలుగు తెరపై చూసాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *