ప్రముఖ గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే కొత్త అవతారం ఎత్తారు. నిన్నటి వరకు పాటలు పాడుతూ సినిమాల్లోకి బాణీలు అందిస్తూ మనల్ని ఎంత టైం చేసిన రఘు కుంచే తాజాగా యాక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తే.గీ ఈసారి ఆయన నక్సలైట్ పాత్రను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో  అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన   “మా నాన్న నక్సలైట్” చిత్రంలో పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది ఈ చిత్రం.

రఘు కుంచే ఈ చిత్రంలో కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  అలాగే సుబ్బరాజు   రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా . జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు. యువ జంటగా  కృష్ణ బూరుగుల , రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి అందించాడు.