హీరో ప్రభాస్‌, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌ మూవీ ప్రొడ్యూసర్‌ విజయ్‌ కిరగందూర్‌ నిర్మించనున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ లో నటిస్తున్నారు. రాధేశ్యామ్‌ తర్వాత నాగ్ అశ్విన్ తో ఒక సినిమా మరియు ఆదిపురుష్‌ సినిమాలు ఇప్పటికే ప్రభాస్ కమిట్ అయ్యాడు.