ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని అందరికీ పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఆశించిన రేంజ్ హిట్స్ ఇవ్వలేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ ని రాబట్టగల ప్రభాస్, తన ట్రేడ్ మార్క్ అయిన యాక్షన్ జానర్ ని వదిలి లవ్ ట్రాక్ ఎక్కడు. దీని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దెగ్గర బాగా కనిపించింది. ఒక్క ఫైట్ లేకుండా ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరో సినిమా చేస్తే, ఆడియన్స్ ఆ మూవీని చూడడానికి రెడీగా లేరేమో అనే అనుమానం రాదే శ్యాం సినిమా కలిగించింది. దీంతో ప్రభాస్ లవ్ ట్రాక్ వదిలి, ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ వైపు అడుగులు వేసి సలార్ సినిమా చేస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ సలార్ ని తెరకేక్కిస్తున్నాడు. ఈ మూవీతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని ప్రభాస్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి, ప్రభాస్ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో పడితే ఎలా ఉంటుందో సలార్ చుపించాబోతోంది.
మారుతీ పుణ్యమాని ప్రభాస్ దెయ్యం అయ్యాడు….
