అభిమానుల్లో లో భారీ అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ నీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు చిత్ర బృందం. వకిల్ సాబ్ చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయినా పింక్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తొ తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో తెలియని ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూర్చిన మగువ మగువ పాట చాట్ బస్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్లో ఉంది.

ఇక ఒక నిమిషం నిడివి కలిగిన వకిల సాబ్ టీజర్ లొ పవన్ కళ్యాణ్ చెప్పింది రెండే డైలాగులు. పవర్ స్టార్ అబ్జక్షన్ యువర్ హానర్ అంటూ ఒక డైలాగ్ మరియు హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో ఫైట్ సన్నివేశంలో కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ చెప్పే మరో డైలాగ్ మాత్రమే ఈ టీజర్ లో చూపించారు. నల్ల కోటు లొ కొంచెం పెంచిన గడ్డం తో పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయి. తమన్ ఇచ్చిన ఆర్ఆర్ కూడా బాగుంది. టీజర్ మొత్తం పవన్ ఫ్యాన్స్ కి పండుగ గిఫ్ట్ లాగా కట్ చేశారు. ఈ టీజర్ లో కథలోని ఇతర పాత్రలు ఏవి పరిచయం చేయలేదు.


ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఇది కదా పవర్ స్టార్ తన అభిమానులకు ఇచ్చే పండుగ కానుక అంటూ సంబరాలు చేసుకుంటూ నెట్టింట దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇంకా కోది సేపు వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు ఈ టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.