పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం నుంచి విజయదశమి భీమ్లా నాయక్ సినిమా లొని అంత ఇష్టమేందయ పాట ని విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ గీతాన్ని వినగానే చిత్ర కథాంశం ను అనుసరించి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ప్రేమానురాగాల గీతం ఇది అనిపిస్తుంది. వీనుల విందుగా సాగిన తమన్ స్వరాలు ఈ గీతాన్ని మరో స్థాయికి చేర్చాయి.

Bheemla Nayak antha istam song out

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను వ్యక్త పరచ గలిగే పాటలు గతంలో వచ్చాయి కానీ ఆ భావం ఎప్పటికప్పుడు నిత్య నూతనం. నిత్యామీనన్ దృష్టికోణంలోనుంచి తన పట్ల భర్త తాలూకు ప్రేమ ఏ పతాక స్థాయిలో ఉన్నదో ఈ పాటలో చక్కగా కొత్తగా అలతి పదాల్లో కుదిరింది.ఈ పాట అతితక్కువ సమయంలో రాయడం బాణీ కట్టడం జరిగిపోయాయి.దాదాపు ఒక గంట వ్యవధిలో పాట రూపకల్పన జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర గారు వినడం,ఆస్వాదించి ఆమోదించడం జరిగిపోయింది. తమన్ చక్కటి బాణీకి చిత్రగారి స్వరం ప్రాణం పోసి పాట ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింప చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు ఈ పాట గురించి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 12 న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *