దక్షిణ భారతదేశం అమితంగా అభిమానించే ఫైన్ జ్యుయలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యుయలర్స్ తన మొదటి స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్­ను కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్­లో ప్రారంభించింది. ఇది నూతన ఫార్మాట్­లో పీఎంజే యొక్క మొదటి స్టోర్. దక్షిణ భారతదేశంలో పీఎంజే యొక్క 27వ మాల్, హైదరాబాద్­లో 6వ స్టోర్. ఈ నూతన ఫార్మాట్ లోని స్టోర్, బ్రాం డ్ యొక్క భారీ స్థాయి విస్తరణ ప్రణాళికల ఉద్దేశాన్ని చాటిచెబుతుంది. ప్రముఖ కూచిపూడి నర్తకి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, 1400 ఏళ్ల క్రితం కాకతీయుల కాలం నాటి ‘కాకతీయం’ను పునరుజ్జీవింపజేసిన జి పద్మజ రెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.

నూతన స్టోర్ విలక్షణ సౌందర్యాన్ని కలిగిఉంటుంది. కాలాతీత సంప్రదాయాన్ని, తాజా సమకాలీన డిజైన్లను మేళవించేదిగా ఉంటుంది. హస్తకళానైపుణ్యానికి అద్దం పట్టే వజ్రాభరణాలు,  కెంపులు, పచ్చలు, నీలం ఇతర విలువైన రాళ్లతో కూడిన నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారంతో లభిస్తాయి. బ్రేస్­లెట్స్, పెండెంట్స్, నెక్లెస్­లు, ఇయర్ రింగ్స్, ఇంకా మరెన్నో డిస్­ప్లే­లో ఉన్నాయి. లైట్ వెయిట్ ఎవ్రీ డే వేర్, బహుమతిగా ఇచ్చే ఆభరణాలు, మీ అందాన్ని పెంచే నగలు లాంటివెన్నో వీటిలో ఉన్నాయి.