నిఖిల్, చందు మొండేటి కాంబో లొ తెరకెక్కిన కార్తికేయకి సీక్వెల్ గా కార్తికేయ‌ 2 జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈరోజు ఏ ఎం బి మాల్ లో ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

Kartikeya 2 trailer launch 1

ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది.అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో నిఖిల్ కి జంట‌గా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని.