• లక్ష్య చిత్రం కొసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.
  • ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతునడు శౌర్య.
  • ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు.
  • ఈ చిత్రంలో శౌర్య కి జంట గా కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
  • డిసెంబర్ 10న విడుదలవుతున్న నాగ శౌర్య ‘లక్ష్య’

నాగ శౌర్య కెరీర్‌లో రాబోతోన్న 20వ చిత్రం లక్ష్యం విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. వరుడు కావలెను వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాగ శౌర్య నుంచి ‘లక్ష్య’ అనే చిత్రం రాబోతుంది.

విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్క వర్షం కూడా పడుతున్నట్టు కనిపిస్తోంది.

naga shourya from lakshya poster

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది.

విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

naga shourya from lakshya

విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రం కి కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ చిత్రంలో నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ తదితరులు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *