నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈరోజు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం టీజర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

‘జీరో కెల్లి వచ్చిన సార్.. చాలా కష్టపడతా.. మంచి ప్లాన్ ఉంది..’ అంటూ నాగచైతన్య పై టీజర్ ఓపెన్ చేశారు. కట్ చేస్తే సాయి పల్లవి తన రెండు కాళ్ళు స్ట్రెచ్ చేస్తూ ఒక వైడ్ షాట్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక టీచర్ లోని చివరి డైలాగ్ సాయి పల్లవి ‘ఏందిరా వదిలేస్తావా నన్ను’ అంటూ చెప్పే మాటలు పవన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ చూసే ప్రేక్షకుడికి తెలియని ఎమోషన్ కు గురి చేస్తాయి. అక్కినేని యువ సామ్రాట్ నీ మనం ఎప్పుడూ చూడని విధంగా చూపించబోతున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఫిదా లో లాగే ఈ చిత్రంలో కూడా సాయి పల్లవి పక్క తెలంగాణ భాష  మాట్లాడుతుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి కి టైటిల్ అప్ట్ అనిపించేలా ఉంది టీచర్. నాగచైతన్య కాస్ట్యూమ్స్ ఇంకా సాయి పల్లవి తో ఊర్లో పరిగెత్తుకుంటూ వచ్చే షార్ట్ చూస్తే గతంలో తేజ దర్శకత్వంలో నితిన్,సదా నటించిన జయం సినిమా గుర్తుకొస్తుంది.