రీమేక్ చిత్రాలను తన స్టైల్ లొ తెరకెక్కించే హీరోలలో విక్టరీ వెంకటేష్ ముందంజలో ఉంటారు ఇప్పటికే తమిళ్ లో విడుదలై జాతీయస్థాయి గుర్తింపు పొందిన అసురన్ చిత్రానికి తెలుగు వర్షన్ రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్ ప్రియమణి హీరోహీరోయిన్లుగా కార్తీక్ రత్నం రాజీవ్ కనకాల నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు చిత్రం నారప్ప. ఈ చిత్రం అనౌన్స్మెంట్ దగ్గరనుంచి ప్రేక్షకులలో విపరీతమైన నా క్రేజ్ వచ్చింది దీనికి కారణం ఒరిజినల్ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే.

అయితే నారప్ప చిత్రం థియేటర్లలో విడుదల చేస్తారు అని అందరూ అనుకున్న చివరికి కరోనా మహమ్మారి కారణంగా ఓటిటీ కే పరిమితం అయ్యింది. ఈ చిత్రం ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలయింది. ఇక ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.

ఈ చిత్ర కథ లోకి వెళ్తే :
నారప్ప (వెంకటేష్‌) తన భార్య సుందరమ్మ (ప్రియమణి) తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని రామసాగరం అనే ఊరిలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. అక్కడి భూస్వామి పాండుసామి (నరేన్) తన ఫ్యాక్టరీ కోసం ఊర్లో అందరి భూమిని దౌర్జ‌న్యంగా లాక్కుంటాడు. నారప్పకు చెందిన మూడు ఎకరాలు తప్ప ఊర్లోని పొలమంతా కూడా పాండుసామి చేతుల్లోకి వెళ్తుంది. వ్య‌వ‌సాయ‌బావిలో నీరు దౌర్జ‌న్యంగా మోటార్‌ద్వారా తీసుకెళ్లే విష‌యంలో సుంద‌ర‌మ్మ‌కు, పాండు స్వామి మ‌నుషుల‌కు గొడ‌వ‌జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ఆవేశ‌ప‌రుడైన మునిక‌న్నా పాండు స్వామి త‌మ్ముడు దొరస్వామి(దీపక్‌ శెట్టి)ని కొడ‌తాడు. ఆ త‌ర్వాత‌ పాండు స్వామిని అవ‌మానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేయిస్తాడు పాండు స్వామి. త‌న‌ అన్నను చంపారన్న ప్రతీకారంతో తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నబ్బ పండుస్వామిని హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. వారినుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ.

ఎవరు ఎలా చేశారు:

నారప్ప చిత్రంలో వెంకటేష్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు తండ్రి పడే బాధను అద్భుతంగా ఫోన్ చేశారు విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ లో ఒదిగి పోయారు . యాస పర్ఫెక్ట్ గా అందుకున్నారు ఇక ప్రియమణి తనదైన నటన శైలితో ఆకట్టుకోగా ఈ ఆశ పట్టుకోలేకపోయారు ప్రియమణి డబ్బింగ్ వేరే వాళ్ల చేత చెప్పి ఉంటే బాగుండు రాజీవ్ కనకాల రత్న రావు రమేష్ తమ తమ పాత్రల మేరకు నటించారు రు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఫర్ఫెక్ట్ ఎడిటింగ్ బాగుంది మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండియర్ లుక్ మనకి తెర పైన కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి మాటలు దర్శకత్వం బాధ్యతలు సక్రమంగా నెరవేర్చారు.

నారప్ప రీమేక్ చిత్రం అయినా కూడా దీన్ని ఒరిజినల్ తో పోల్చి చూడకూడదు తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రాన్ని సీన్ టు సీన్ డైరెక్టర్ చాలా మరియు క్రమశిక్షణతో డిజైన్ చేసుకున్నారు సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం ఫ్లాట్ గా అనిపించినా క్లైమాక్స్ పర్ఫెక్ట్ ఆప్ అనిపించింది ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వెంకటేష్ యాక్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ మణిశర్మ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ పెద్దగా కనెక్ట్ అవ్వని సెకండాఫ్ ఫ్లాట్ నరేషన్.

ఈ చిత్రానికి టాలీవుడ్ స్టోరీ రేటింగ్ 2.75/5.