జె.ఎల్.14 రీల్ సినిమా ప్రొడక్షన్ పతాకంపై జె.వి మోహన్ గౌడ్ సమర్పణలో యస్. కె జలీల్ నిర్మాతగా రాజశేఖర్ సుధా పల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకో బోతున్న “నా ప్రేమ కథ చిత్రం” చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హాలులో ఈ రోజు ఘనంగా జరిగాయి.ఈ చిత్ర హీరో హీరోయిన్లుగా సంతోష్ ,పవన్,ప్రసునా చంద్రిక, సైవా నాయుడు, నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన సినీ ప్రముఖులు ‘మా’ మాజీ అధ్యక్షులు శివాజీరాజా ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టగా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, సుఖీభవ ప్రాపర్టీస్ అధినేత ఏ.గురురాజ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. హాజరైన అతిథులందరూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపి.. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా

 చిత్ర సమర్పకుడు జె. వి. మోహన్ గౌడ్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి ఇందులో పార్ట్నర్ గా చేరడానికి ఒప్పుకున్నాను, సినిమా బాగా రావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

 నిర్మాత యస్.కె. జలీల్ మాట్లాడుతూ… మోహన్ గౌడ్ గారు మా టీం లో చేరడం మా అదృష్టం  ఆయన అనుభవం  మేము అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడానికి  ఉపయోగ పడుతుంది. జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

 దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎక్కడ
కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయమని ధైర్యాన్ని నిర్మాతలు నాకు ఇచ్చారు. కచ్చితంగా వాళ్ల నమ్మకాన్ని నిలబెడతానని, షూటింగ్ కు ముందు నుంచే 30 రోజులు హీరో హీరోయిన్లకు రిహార్సల్  చేయించామని తెలిపారు.ఈ చిత్రంలో వింజమూరి మధు ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తుండగా ఇంకా మిగిలిన పాత్రలలో తిరుపాల్ ,మల్లయ్య,రాబి,సలామ్  నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాయక్
పర్వేజ్ సంగీతదర్శకుడిగా,మేనగ శ్రీను ఎడిటర్ గా, వై. రవి ఫైట్ మాస్టర్ గా పని చేస్తున్నారు అని అన్నారు.