నేను కొరటాల శివ తో చాలా ముఖ్యమైన పని గురించి మాట్లాడాను ఈరోజు ఆరున్నరకి దానికి సంబంధించి అప్డేట్ ఇస్తాను అని ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ తన ఫాన్స్ అందరికీ తెలిపారు. చాలామంది మెగాస్టార్ ఏం చెప్తారు అని ఎదురు చూస్తూ ఉండగా, ఫాన్స్ అందరికీ షాక్ ఇచ్చారు మెగాస్టార్. సరిగ్గా ఆరు గంటల 30 నిమిషాలకు మెగాస్టార్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక మేమ్ వదిలాడు. అందులో లో ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ మరియు మెగాస్టార్ మాట్లాడుతున్నట్టు ఉంది. అందులో చిరు ఏమయ్యా కొరటాల ఆచార్య టీజర్ ఎప్పుడు? న్యూ ఇయర్ కి లేదు,సంక్రాంతికి లేదు ఇంకెప్పుడూ అనగా సమాధానంగా కొరటాల అదే పనిలో ఉన్నాను సార్ అంటున్నారు. దీనికి మెగా స్టార్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ షాక్ ఇస్తూ కొరటాల వైపు చూస్తున్నారు దానికి సమాధానంగా కొరటాల రేపు మార్నింగ్ అనౌన్స్మెంట్ చేస్తా సార్ అంటూ సమాధానం ఇచ్చారు, దీనికి మళ్లీ మెగాస్టార్ ఇస్తావు గా అంటూ రివర్స్లో మళ్లీ ప్రశ్నించారు దీనికి కొరటాల టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది రేపు ఉదయం పది గంటలకి అనౌన్స్ చేస్తాను ఇది ఫిక్స్ సార్ అంటూ ఉన్న మీం ని మెగా స్టార్ పోస్ట్ చేశారు.