మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.మెగాస్టార్ నటించిన ఆచార్య చిత్రానికి దర్శకుడు కొరటాల శివ సంగీతం  మణి శర్మ. ఈ టీజర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ ఫస్ట్ ప్రైమ్ నుంచే గూస్ బమ్స్ తెపిస్తుంది. ఇక ఆచార్య టీజర్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా ఉన్నారు ముఖ్యంగా చిరంజీవి చేపే డైలాగ్ పాఠాలు చెప్పకపోయినా, ఆచార్య అని ఎందుకు అంటున్నారు.. బహుశా గుణపాఠం చెబుతానని ఏమో  అని చెప్పే డైలాగ్ చాలా సెటిల్ గా చెప్పారు. ఇందులో చివర్లో చేసే ఫైట్ లో చిరంజీవి ఒక జోబులో చేయి పెట్టుకొని మరో చేతితో ప్రత్యర్థులను కొట్టడం చాలా కొత్తగా స్టైలిష్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బమ్స తెప్పించేలా ఉంది. ఆచార్య దేవోభవ ఆచార్య రక్ష భవ అని వచ్చే టైటిల్ మ్యూజిక్ అదుర్స్.