ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.


రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపోందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో అల్ట్రా మాస్ చిత్రంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.