సంక్రాంతి పండుగ సీజన్లో సినిమాల గిరాకీ వేరు ప్రతి స్టార్ హీరో కన్నేసే సీజన్లలో సంక్రాంతి కూడా ఒకటి. ప్రతి సంక్రాంతికి కి స్టార్ హీరోలు తమ సినిమాల్ని సంక్రాంతి బరిలో దింపి పరీక్షించుకుంటారు ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రం విడుదల ముందు నుంచే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తొమ్మిదో తారీఖు సెకండ్ షో తో సినిమా మా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తరువాత ఈరోజు నైజాం డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి వరంగల్ శీను తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ప్రొడ్యూసర్లు దిల్ రాజు శిరీష్ పై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కబాలి, గద్దల కొండ గణేష్,ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూషన్ చేశారు. వరంగల్ శీను మాట్లాడుతూ…
నైజాం లో థియేటర్స్ పై ఒక నియంత పాలన జరుగుతుంది, దిల్ రాజు శిరీష్ రెడ్డి లు నైజాం లో ఇద్దరు పెత్తనం చలాయిస్తున్నారు , మంచి గా రన్ అవుతున్న క్రాక్ సినిమా నీ థియేటర్స్ లో తీసేస్తున్నారు, జనవరి1నుంచి క్రాక్ సినిమా కోసం థియేటర్స్ కోసం అడుగుతు వాళ్ళు చుట్టూ తిరుగుతూ వుంటే వాళ్ళకి చులకనగా వుంది.

సంవత్సరం క్రితం నేను క్రాక్ ప్రొడ్యూసర్ తో ఒప్పందం చేసుకున్నాను. నాకు చత్త థియేటర్స్ ఇచ్చి వాళ్ళు మంచి థియేటర్స్ ఉంచుకున్నారు. క్రాక్ సినిమా బాగున్న కూడా థియేటర్స్ లాగేసు కుంటున్నారు
వాళ్ల వలన నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అందుకే మీడియా ముందుకు వచ్చాను నా దగ్గర డబ్బు వుందని దిల్ రాజు అనుకుంటున్నారు.

కానీ అతను ఏ స్థాయి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు దిల్ రాజు కాదు అతను కిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ లను కిల్ చేసే వ్యక్తి.అతనికి ఇంగ్లీష్ రాదు. నన్ను పది మందిలో అవమానించాడు నన్ను రారా పోరా అని మాట్లాడాడు. నైజాం లో వాళ్ల నుంచి స్వతంత్రం వచ్చే రోజులు వున్నాయి,దిల్ రాజు శిరీష్ లు మారండి అని ఆవేదన వ్యక్తం చేయగా…. ఆయనకు మద్దతుగా సంపత్ నాయక్ (ou యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు) మాట్లాడుతూ మంచిగా కలెక్షన్స్ వాసున్న క్రాక్ సినిమాని తీసేస్తున్నారు దాని వల్ల ఆ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సినిమా మీద మక్కువతో శ్రీను అనే అతను తన డబ్బులతో సినిమాని రిలీజ్ చేస్తే నీ పెత్తనం ఏమిటి… నిన్న మీటింగ్ లో శ్రీను నీ అందర ముందు అవమానించాడు డబ్బులు వున్నాయి కదా అని నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తి స్తావా.. సంక్రాంతి సీజన్ లో డబ్బింగ్ సినిమాల కు ఎలా ఇస్తారు థియేటర్స్ అని చెప్పావు ,ఇపుడు తెలుగు సినిమా క్రాక్ నీ తీసేసి తమిళ్ డబ్బింగ్ సినిమాలు థియేటర్స్ ఎలా ఇస్తారు.. అని ప్రశ్నించారు.దిల్ రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీవు మాట్లాడే భాష ఎంటి.సినిమా ఇండస్ట్రీ నీ కబ్జా చేస్తున్నాడు. ఇప్పటికైనా మీరు డిస్ట్రిబ్యూటర్ లు తో మాట్లాడి సినిమా హాల్లు పంచుకోండి సినీ పెద్దలు అందరూ కూడా కలసి ఈ సమస్య పై మాట్లాడండి. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమిస్తాము అని అన్నారు.