ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు కమల్. అతను ఆసుపత్రిలో చేరినట్లు తన అభిమానులకు తెలియజేయడానికి ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు.

67 ఏళ్ల ఈ నటుడు ‘ఖద్దర్’ అనే పేరుతో తన దుస్తుల బ్రాండ్ ను ఇటీవలే ప్రారంభించిన తర్వాత US నుండి తిరిగి వచ్చాడు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కమాల్ కు దగ్గు వచ్చింది. కమల్ హాసన్ తనను తాను పరీక్షించుకో గా COVID-19కి పాజిటివ్ అని తేలింది.

“నేను ఆసుపత్రిలో నన్ను ఒంటరిగా ఉంచుకున్నాను. మహమ్మారి ఇంకా ముగియలేదని గ్రహించాల్సిన సమయం ఇది. దయచేసి జాగ్రత్తగా ఉండండి’ అని ట్వీట్ చేశారు కమల్.

ప్రస్తుతం కమల్ హాసన్ ‘బిగ్ బాస్ తమిళ్ 5’ హోస్ట్ చేస్తున్నారు. దీనితోపాటు దర్శకుడు లోకేష్ కనకరజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్‌ తో కలిసి విక్రమ్ చిత్రంలో నటిస్తున్నారు.