15 సంవత్సరాలుగా ధరించిన తన చెవి రింగును పోగొట్టుకున్నానని దానిని కనుగొనడంలో సహాయపడాలని ప్రముఖ బాలీవుడ్ నటి జూహి చావ్లా ట్విట్టర్ లో అభిమానుల్ని కోరడం ఆసక్తిగా మారింది.గత 15 సంవత్సరాలుగా నేను ఈ చెవిరింగులను దాదాపు ప్రతిరోజు ధరించాను, ఇప్పుడు పోగొట్టుకున్నాను అంటూ ఆవేదనగా జుహి చావ్లా ట్విట్టర్ లో వెల్లడించారు. తన రింగును వెతికి ఇవ్వాల్సిందిగానూ అభ్యర్థించారు.
ముంబై విమానాశ్రయంలో తాను కోల్పోయిన చెవి రింగుని కనుగొనడంలో సహాయపడాలని ఆదివారం సాయంత్రం పోస్ట్ చేశారు. వెతికి పెట్టినవారికి బహుమతి కూడా ఇస్తాను అని తెలిపారు.