ప్రముఖ తెలుగు హీరోయిన్‌ ప్రణీత సుభాష్ పెళ్లి పీటలెక్కింది. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇక వివాహానికి హాజరైన ఓ స్నేహితు పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వివాహం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *