గత కొన్ని రోజులుగా సినీ కార్మికులను బాధిస్తున్న విషయం ఆగస్టు ఒకటి నుంచి షూటింగులు నిలిపివేయాలని గిల్డ్ తీర్మానం చేయటమే. కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్ లు ప్రారంభమై నాలుగు ముద్దలు తింటున్నాము అని సంబరపడిపోయే లోపే మళ్ళీ ఈ బాధ ఏంటి దేవుడా అని బాధపడుతున్నారు సినీ కార్మికులు.

ఇదే విషయమై ఈరోజు మరొకసారి ఫిలిం ఛాంబర్ లో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలని చర్చించామని చెప్తూ ,ఈ రోజు చర్చలు బాగా జరిగాయి, ఫస్ట్ 3 విషయాలపై చర్చించాము, మళ్ళీ జూలై 30 న మరోసారి కలుస్తాము ఆగస్టు మొదటి వారంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని ఆశిస్తున్నాం అని అన్నారు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్.

ఇక షూటింగ్స్ గురించి 31 న జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని చేపుతాము ఈలోగా జూలై 30 మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు
సి కళ్యాణ్. మరి 31న జనరల్ బాడీ మీటింగ్ లో ఏం తెలుస్తారని యావత్తు సినీ కార్మికులు ఎదురుచూస్తున్నారు.