‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లల కాంబినేషన్ లోరాజకుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంషూటింగ్ ఏకధాటిగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతొంది. బాబీ ఏడిద క్రియేటివ్వర్క్స్

సమర్పణ లో బాబీ ఏడిద,రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లా డుతూ- ‘’ఇదొక ఇంటరెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రతి సన్నివేశము కొత్తగా, ఆసక్తికరంగాఉంటుంది. డిసెంబర్ 2 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తున్నాం. జనవరి మొదటివారంతో సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనిరాజమండ్రి, నిడదవోలు, కాకినాడ, ఉప్పాడ, రాజనగరం, రంపచోడవరం, గుడిసె తదితరప్రాంతాల్లో ఇంతవరకు ఎవరు షూటింగ్ చెయ్యని లొకేషన్స్ లో చేస్తున్నాం. ఇప్పటి వరకు30 శాతం సినిమా పూర్తయింది. ఇందులో రెండు పాటలు ఉన్నాయి. వాటిని కూడాఇక్కడే చిత్రీకరిస్తున్నాం. కీలకమైన సన్నివేశాల కోసం రాజమండ్రి లో పోలీస్ స్టేషన్ సెట్, కలెక్టర్ ఆఫీసు సెట్, ఇన్వెస్టిగేషన్ సెట్ వేశాం. ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల క్యారెక్టరైజేషన్స్డిఫరెంట్ గా అనిపిస్తాయి. త్వరలోనే టైటిల్ ని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

టీఎన్ఆర్’’,’రంగస్థలం’ నాగ మహేష్ , అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ , బండి స్టార్ కిరణ్ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహనిర్మాత: అడ్డాల రాజేష్, నిర్మాత‌లు: బాబీఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.