Ek Mini Katha Review

Rating 3/5.


వర్షం చిత్రం దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా కావ్య తపర్ హీరోయిన్ గా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ మినీ కథ  చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదల కు నోచుకోక ఈరోజు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.

సంతోష్ ( సంతోష్ శోభన్ ) వృత్తి రీత్యా ఒక సివిల్ ఇంజనీర్. అతని కి మైక్రో పెనిస్ సిండ్రోమ్ వుంటుంది. ఈ విషయాన్ని తనలోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటాడు ఎవరితో ఈ విషయాన్ని పంచుకొడు. దీని నుంచి బయటపడడానికి సంతోష్ చేయని ప్రయత్నం అంటూ ఉండదు. సంతోష్ కి అమృత (కావ్య థాపర్) తొ పెళ్లి నిశ్చయం అవుతుంది. ముహూర్తానికి కన్నా ముందే అనుకోని కారణాల వల్ల సంతోష్ అమృత ల వివాహం జరుగుతుంది. సంతోష్ కి ఉన్న సిండ్రోం వల్ల పెళ్లి తర్వాత జరగవలసిన శోభనం నీ వాయిదా వేస్తూ వస్తుంటాడు. ఇదే సమయంలో తన సిండ్రోమ్ కి మందు ఒక సన్యాసిని (శ్రద్ధ దాస్ ) దగ్గర అ మందు లభిస్తుంది అని తెలుసుకున్న సంతోష్ ఏదో రకంగా ఆ మందు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. దీనివల్ల సంతోష్ అమృత కాపురంలో లో మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇక తాను వివాహం చేసుకున్న అమృత తో ఎలా ఒక్కటే అయ్యాడు తన సిండ్రోమ్ ని ఎలా బాగు పరుచుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ.

యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. యూత్ ని టార్గెట్ చేసి తీసినట్లు గా తెలుస్తోంది. ఓ టి టి కి పర్ఫెక్ట్ పిక్చర్. మేర్లపాక గాంధీ అందించిన కథ మాటలు బాగున్నాయి. సంతోష్ శోభన్ నటన బావుంది . తన కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఇ పాత్ర ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి.  కావ్య తన పాత్ర పరిమితి మేరకు నటించింది.  శ్రద్ధా దాస్ సన్యాసిని పాత్రలో  తన పరిమితి మేరకు నటించింది.  సన్యాసి నీ పాత్ర చాలా మినీ గా ఉంటుంది. పోసాని కృష్ణ మురళి, సుదర్శన్ ,సప్తగిరి ,బ్రహ్మాజీ , హర్షవర్ధన్, తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు పర్వాలేదు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ బావుంది. సత్య ఎడిటింగ్ పర్వాలేదు. యు వి కాన్సెప్ట్ మరియు యు.ఎస్ మాంగో మాస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సరిపోయినంత బడ్జెట్ పెట్టి తమ ప్రొడక్షన్ వాల్యూస్ కాపాడుకున్నారు.

ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ తో ప్రారంభమై ముందుకు వెళ్లే సమయంలో సాగదీత గా మారిపోతుంది. ఈ సాగదీత ను కూడా తన కామెడీ తో మరిచిపోయేలా గా చేశాడు మేర్లపాక గాంధీ. ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఇంట్రెస్ట్ మీకు సెకండ్ హాఫ్ లొ ఉండదు. ఈ చిత్రం యొక్క క తగ్గించి ఉంటే బాగుండేది.  ఈ చిత్రాన్ని ఒక మంచి కాన్సెప్ట్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేద్దాం అనుకుని రెగ్యులర్ ఫార్మేట్ లోకి తీసుకు వచ్చేసారు మేకర్స్.

ఈ చిత్రానికి టాలీవుడ్ స్టోరీ ఇచ్చే రేటింగ్ 3/5.