మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో భాగంగా ఉక్రెయిన్ లొ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ఒకటి మొదలైంది. అయితే అయిన ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను అవమానించ లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం…

కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడానికి సెలబ్రిటీలకు భారీ మొత్తంలో చెల్లించుకుని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటారు. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలు ఇతర ఇతర బ్రాండ్లకు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ అంబాసిడర్ గా ఉన్న హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ తమ వ్యాపార అభివృద్ధి కోసం పండుగ సీజన్ లో ఆఫర్లు పెట్టి రామ్ చరణ్ చేత ప్రమోట్ చేయించుకుంది. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ విడుదల చేసిన ఫుల్ పేజి యాడ్ లో భాగంగా రామ్ చరణ్ పూర్తిగా తెల్లటి దుస్తుల్లో కనిపిస్తూ జాతీయ జెండా ఎగర వేస్తున్నట్లుగా ఒక ఫోటో వచ్చింది. అయితే ఇందులో అశోకచక్రం కనిపించడం లేదు. దీనితో సోషల్ మీడియా వేదికగా కొంతమంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై  విపరీతంగా ఫైర్ అవుతున్నారు. జాతీయ జెండాను అవమానించారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇలా కొంత మంది కామెంట్లు పెడుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి టాగ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జాతీయ జెండాను కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కొరకు వాడరాదని తేల్చి చెప్పేశారు. కానీ రామ్ చరణ్ తేజ అ పట్టుకున్న టువంటి  ఆ త్రివర్ణ జెండా ని యాడ్ ల కోసం వాడుకోవచ్చు అని చెప్పేశారు ఎందుకంటే అందులో అశోకచక్ర లేదు కాబట్టి, అది కేవలం మూడు రంగులు ఉన్న ఒక జెండా లాగా పరిగణించబడుతుంది. జాతీయ జెండా లాగా కాదు కాబట్టి దీన్ని కమర్షియల్ యాడ్ ల కోసం వాడుకోవచ్చు అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఈ వివాదం ఇంతటితో ముగిసి పోయేలాగా సదరు వ్యక్తి పెట్టిన ట్వీట్ నీ డిలీట్ చేయమని చెప్పారు. 

hyd police on ram charan
hyd police on ram charan


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *