ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తున్న చిత్రం
దెయ్యంతో సహజీవనం. బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనేదే ఈ సినిమా కథ. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తొలి సారి డైరెక్టర్ గా నట్టి క్రాంతి ఈ సినిమా నీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా వుంది. ఈ చిత్రాని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 
కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ”మందార కన్నె మందార’ పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడారు.  సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. త్వరలో సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా లో నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,
హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు నటించారు.

Deyyamtho Sahajevanam natti karuna 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *