సంప్రదాయ మరియు ఆధునిక భారతీయ స్వీట్లు మరియు స్నాక్స్‌లో అగ్రగామి,దాదూస్ తమ నూతన ఔట్‌లెట్‌ను బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12, హైదరాబాద్ వద్ద తెరిచినట్లు వెల్లడించింది. దాదూస్ నూతన స్టోర్ ఆధునిక రుచుల స్పర్శతో రుచికరమైన మరియు ప్రామాణికమైన అత్యున్నత శ్రేణి స్వీట్ ,రుచికరమైన ఉత్పత్తులకు నిలయంగా ఉంటుంది. సంప్రదాయ రుచులను అత్యుత్తమంగా అందిస్తున్నప్పటికీ, ఈ మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన స్వీట్‌బ్రాండ్ విచక్షణ కలిగిన హైదరాబాద్ వాసుల అవసరాలను తీర్చడంతో పాటుగా మారుతున్న నగరవాసుల అభిరుచులకు తగినట్లుగా వైవిధ్యమైన తియ్యందనాలనూ సృష్టిస్తుంది. స్వీట్లకు అత్యంత ప్రసిద్ధి చెందడమే కాదు, ఇప్పుడు ఇప్పుడు తియ్యందనాల పరంగా నగరంలో ఇంటిపేరుగా దాదూస్ మారింది.

భోజన ప్రియుల కలల స్వర్గధామంగా ఏర్పాటైన బంజారాహిల్స్‌లోని ఈ నూతన ఔట్‌లెట్, అత్యద్భుతమైన ఇంటీరియర్స్ ను మాయా వాతావరణంతో కలిగి ఉంటుంది. దీని యొక్క ఆహ్లాదకరమై వాతావరణంతో, దాదూస్ సాటిలేని రీతిలో తీపి మరియు రుచికరమైన పదార్థాలను అందిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో దాదూస్, భారతదేశ వ్యాప్తంగా కనిపించే పలు మిఠాయి రుచులు అందిస్తుంది. వీటిలో దక్షిణ భారతీయ స్వీట్లు మొదలు రుచికరమైన పదార్థాలు, బహుమతిగా అందించతగిన మిఠాయి, టర్కిష్ రుచులు, డ్రై ఫ్రూట్స్, ఇటాలియన్ నాణ్యత గెలాటోస్ ,నూతనశ్రేణి బేకరీ ఉత్పత్తులు ఉంటాయి. వీటితో పాటుగా మాక్‌టైల్ కౌంటర్ మరియు అధీకృత చాట్ సెక్షన్ కూడా ఉంటాయి.
నగరంలోని ఆహార ప్రియుల కోసం మొదటి అంతస్ధులో నూతన మెనూ మరియు కొన్ని నూతన రుచులు వంటివి అవార్డులు గెలుచుకున్న మసాలా రిపబ్లిక్ కోసం ఉంటాయి. వెజిటేరియన్ క్యుసిన్, శ్రద్ధతో కూడిన సేవలు, విలాసవంతమైన డిజైన్ వంటివి అతిథులు మరియు వినియోగదారులను ఒకేలా ఆకట్టుకోవడంలో ఈ రెస్టారెంట్ యొక్క నైపుణ్యం ప్రదర్శితమవుతుంది. యువ మరియు నగర ప్రజలు ఈ రెస్టారెంట్‌లో నమ్మశక్యం కానటువంటి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. సరిహద్దులను అధిగమించి మరీ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రుచులను స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ నేపథ్యంతో తీసుకువస్తుంది.
*ఈ సందర్భంగా దాదూస్ యజమాని రాజేష్ దాదూ మాట్లాడుతూ* ‘‘ బంజారాహిల్స్‌లో దాదూస్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. గత కొద్ది సంవత్సరాలుగా దాదూస్ బ్రాండ్ వేగవంతంగా వృద్ధి చెందుతుంది. మేము బహుళ రెట్ల వృద్ధిని చూస్తున్నాము. రాబోయే సంవత్సరంలో అత్యాధునిక ఫ్యాక్టరీని ఏర్పాటుచేయనుండటం ద్వారా మరింత వేగవంతంగా వృద్ధి చెందగలమని భావిస్తున్నాము. ఈ ఔట్‌లెట్ మొత్తంమ్మీద దాదూస్ గ్రూప్ ఆఫరింగ్‌ను వృద్ధి చేయనుంది’’ అని అన్నారు.
ముస్కాన్ దాదూ మరింతగా జోడిస్తూ ‘‘ మా జాబితాకు మరో అత్యంత అందమైన స్టోర్‌ను జోడించడం పట్ల మేము ఆనందంగా ఉన్నాము. ఇది మా ప్రతిష్టాత్మకమైన సేవలకు ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా రాబోతున్న పండుగల వేళ మరుపురాని, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాలను సైతం అందించనుంది. ఈ ప్రారంభం ఒక ఉత్తేజకరమైన సీజన్‌కు నాంది పలుకుతోంది. ఇది మా సరికొత్త ఉత్పత్తులను మేము ఆవిష్కరించినప్పుడు ఆశ్చర్యానుభూతులను మిళితం చేసుకోవడం మాత్రమే కాదు, మా పోషకులందరి అవసరాలకు సరిగ్గా సరిపోయేలా ఆలోచనాత్మకంగా నిర్వహించబడుతుంది’’ అని అన్నారు.
