ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదాన్ని అందించే భిన్న త‌ర‌హా సినిమాల‌ను అందించ‌డం ద్వారా స‌మీప భ‌విష్య‌త్తులో అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకొనే ల‌క్ష్యంతో సినిమా ప్రొడ‌క్ష‌న్‌-డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అడుగులు వేస్తోంది.

తాజాగా శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా ’90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 3గా ‘హౌస్ అరెస్ట్’ అనే చిత్రాన్ని ప్రారంభించింది.

కె. నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం ప్రారంభ‌మైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ సైతం నేటి నుంచే జ‌రుగుతోంది.

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ డైరెక్ట‌ర్ బాబీ క్లాప్ నిచ్చారు.

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. చంద్ర‌బోస్ సాహిత్యం అందిస్తున్నారు.

తారాగ‌ణం:
శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాష్‌, సున‌య‌న‌

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: శేఖ‌ర్‌రెడ్డి యెర్ర‌
ప్రొడ్యూస‌ర్‌: కె. నిరంజ‌న్ రెడ్డి
బ్యాన‌ర్‌: ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి చైత‌న్య‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అస్రిన్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్ట‌ర్‌: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
ఆర్ట్‌: జి.ఎం. శేఖ‌ర్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. సూర్య‌నారాయ‌ణ‌