హీరోలు అల్లు అర్జున్‌,రానా దగ్గుబాటి లకు హాస్యనటుడు బ్రహ్మానందం సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 45 రోజులపాటు శ్రమించి శ్రీ వేంకటేశ్వర స్వామి స్కెచ్‌ను పెన్సిల్తో గీసి.. దాన్ని ఫొటోఫ్రేమ్‌ చేయించి నా గీత గోవిందుడు అని రాసి నూతన సంవత్సర కానుకగా హీరోలకు అందించారు. దీన్ని హీరోలు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చాలా అమూల్యమైనది ఈ బహుమతి అని హీరో అల్లు అర్జున్ అనగా మా తాతయ్య దీన్ని అమితంగా ప్రేమించేవాడు అని తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.