నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ‘మెంటల్ మదిలో’,‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది.
కథ:
సుందర్ (నాని), లీలా థామస్ (నజ్రియా) స్కూల్ స్నేహితులు. బాల్యం నుండి, సుందర్ USAని సందర్శించాలనే ఆలోచనతో నిమగ్నమై ఉన్నాడు, అయితే లీలా థామస్ గుర్తింపు పొందాలని కోరుకుంటాడు. సుందర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆమె ఫోటోగ్రాఫర్. లీలా మరియు సుందర్ చివరికి ప్రేమలో పడతారు మరియు వారు USAలోని ఒక ద్వీపంలో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వారి ప్రణాళికలు వర్కవుట్ కావడం లేదు. యుఎస్ ట్రిప్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు, వారు తమ మతాంతర వివాహానికి తల్లిదండ్రుల నుండి ఆమోదం పొందాలని ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. సుందర్ బిడ్డతో తాను గర్భవతి అని ఆమె తల్లిదండ్రులకు అబద్ధం చెప్పింది, అతను తన తల్లిదండ్రులకు తనకి సంతానలేమి సమస్య ఉందని చెప్తాడు. ఇలాంటి సందర్బం లో లీలా, సుందర్ ప్లాన్ సాఫీగా సాగుతుందా? లేక మరిన్ని చిక్కులు తలెత్తుతాయా? అనేది అంటే..సుందరానికీ కధ.

విశ్లేషణ:
సుందర్ మరియు లీల బ్యాక్‌స్టోరీలు తో పటు చిన్ననాటి ఎపిసోడ్‌లు దాదాపు ఒక గంట రన్‌టైమ్‌ను తినేశాయి. మామూలు సిచువేషన్ ని కూడా దర్శకుడు తిప్పి తిప్పి చెప్పాడు.
నాని ఎప్పటిలాగే తన నాచురల్ యాక్టింగ్ ను ఈ సినిమాలో చూపించాడు. హీరోయిన్ నజ్రియా చాలా అందంగా కనిపించింది, తన పాత్ర మేరకు న్యాయం చేసిందనే చెప్పుకోవాలి. దర్శకుడు వివేక్ ఆత్రేయ బ్రాహ్మణ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి వీరిద్దరి మధ్య లో ప్రేమ కామెడీ తో పాటు కథలో సంతానలేమి సమస్య దానికి తగ్గట్టుగా ఆయన కథ
అల్లుకోవడం తో కథని నీటుగా హ్యాండిల్ చేశాడని చెప్పుకోవాలి. ఇదే కథలో కొత్తదనం అని కూడా చెప్పుకోవచ్చు
అయితేసుందర్ మరియు లీల బ్యాక్‌స్టోరీలు తో పటు చిన్ననాటి ఎపిసోడ్‌లు దాదాపు ఒక గంట రన్‌టైమ్‌ను తినేశాయి. మామూలు సిచువేషన్ ని కూడా దర్శకుడు తిప్పి తిప్పి చెప్పాడు.
సీనియర్ నటుడు నరేష్ మరియు రోహిణి తమ తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది ముఖ్యంగా ఈ సినిమాలో నాని యొక్క కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్.
అయితే ఫస్ట్ హాఫ్ చాలా సాగదీసినట్లు అనిపించే లోపే, సెకండాఫ్ మీకు కామెడీతో లాగించేశాడు. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సరిపోయాయి. సంగీతం పర్వాలేదు .
రేటింగ్: 2.5/5