నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్
టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ
అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ
అయింది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో
రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: న్యూ ఈయర్ సందర్భంగా మా సినిమా
కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు హీరో అడివి శేష్ కు ముందుగా
థాంక్స్. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’
రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి
రెస్పాన్స్ వచ్చింది.కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ
లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్
పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పుడు పరిస్థితులన్ని
చక్కబడ్డాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో థియేటర్లలోనే రిలీజ్
చేయబోతున్నాం.ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ
సినిమాలో చర్చించబోతున్నాం. ’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్,
షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.