అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం “మేజర్”. ఈ చిత్రంలో అడివి శేష్ కథానాయకుడిగా నటించడమే కాకుండా కథా స్క్రీన్ప్లే కూడా అందించారు. ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd
Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd

ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ ,భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.
ఈ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో  పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడివి శేష్ నుదిటిపై గాయంతో కనిపించగా, తాజ్ హోటల్‌కు ఉగ్రవాదులు నిప్పుపెట్టిన విజువల్ స్టన్నింగా కనిపిస్తుంది.

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd hindi

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ హృదయం పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. మేజర్ టీజర్ గ్రిప్పింగ్ నేరేషన్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో అద్భుతమనిపించింది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మిస్తుంది.

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd

శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా దర్శకత్వ బాధ్యతను దర్శకుడు శశికిరణ్ తిక్క వహిస్తున్నారు.

Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd Malayalam