యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన ప్రదీప్ మాచిరాజు కొన్ని సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. ఇప్పుడు వెండితెరపై పరిచయమవుతున్నాడు ప్రదీప్ తాను హీరోగా నటించి పరిచయమవుతున్న తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సి ఉండగా కరుణ మహమ్మారి కారణంగా ఈ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి సమీక్షిద్దాం.
అర్జున్ అక్షర  ఒకే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు. పక్క పక్క ఇళ్లల్లోనే ఉండే వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పరస్పరం చూడగానే చిరాకు పడిపోతుంటారు. అలాంటి వీళ్లిద్దరూ కొన్ని అనూహ్య పరిస్థితుల మధ్య ఒకరి శరీరంలోకి ఒకరు ప్రవేశించాల్సిన పరిస్థితి వస్తుంది. గత జన్మలో ప్రేమికులై ఉండి అర్ధంతరంగా ప్రాణాలు వదిలిన ఈ జంట, మళ్లీ ఈ జన్మలో కలవడం కోసమే ఇలా జరిగిందని ఓ స్వామీజీ చెబుతాడు. ఐతే ఒకరినొకరు అసహ్యించుకునే అర్జున్.. అక్షర ఎలా ప్రేమలో పడి తిరిగి తమ తమ శరీరాల్లోకి వెళ్లారన్నది మిగతా కథ.


హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఫ్రీమేక్ అవడం మామూలే. అలాంటి కోవలో చెందినదే ఈ చిత్రం కూడా. ఇట్స్ ఎ బాయ్ గర్ల్ థింగ్ అనే హాలీవుడ్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో ప్రాణం, ఆనందం వంటి సినిమా ల స్ఫూర్తి పొంది తనదైన స్టైల్లో కదా అని అనుకుంటూ వచ్చాడు దర్శకుడు మున్నా. అయితే దీంట్లో లో ఒకటి శరీరంలోకి మరొకరు ప్రవేశించడం అనేది మొన్న వచ్చిన శ్రీనివాస్ రెడ్డి జంబలకడిపంబ సినిమాలో కూడా చూశాం. ఇలా పలు సినిమాల కథలు నుంచి స్ఫూర్తి చెంది పూర్తిగా కిచిడీ కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు ఉన్నా.

ఇక యాంకర్ నుంచి నటుడిగా మారిన ప్రదీప్ మాచిరాజు కామెడీ టైమింగ్ బావుంది. అమృత పర్వాలేదు అనిపించింది. శుభలేఖ సుధాకర్ వైవా హర్ష భద్రం తమ తమ పాత్రల మేరకు నటించారు. ప్రదీప్ ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త నటనని అభివృద్ధి పరుచుకోవాలి. సినిమా కథ ఎంత కిచిడీ గా తయారు చేస్తున్న ప్రేక్షకుల్ని సెకండాఫ్లో కూర్చోబెట్ట లేకపోయింది. ఇక నీలి నీలి ఆకాశం పాట తప్ప మరే పాట సినిమాలో చెప్పుకోదగ్గ గట్టిగా లేదు. క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ మెయింటెయిన్ చెయ్యలేకపోయాడు దర్శకుడు. అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.